నిర్మాతలకు హీరోల డిమాండ్లు…!

-

ఇప్పుడు సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటున్నాయి. దాదాపు అన్ని సినిమాలు కూడా కమర్షియల్ గానే ఉండే విధంగా నిర్మాతలు దర్శకులు, హీరోలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా కమర్షియల్ గా ఉంటేనే ఫాన్స్ ఇప్పుడు ఆదరిస్తున్నారని… అందుకే దర్శక నిర్మాతలు, హీరోలు అలాగే ప్రయత్నాలు చేస్తూ సినిమాను అలాగే తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతుంది.

ఇప్పుడు ఈ కమర్షియల్ పిచ్చి హీరోలకు కాస్త ఎక్కువైంది అనే వాళ్ళు ఉన్నారు. హీరోలు కొంత మంది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు, పాన్ ఇండియా వైడ్ గా సినిమా విడుదల అయితే అది వసూళ్లు భారీగా సాధిస్తుంది అని నమ్ముతున్నారు. అందుకే తమ తమ సినిమాల్లో నేషనల్ హీరోలను తీసుకురావాలని, తమిళం వాళ్ళను, హింది వాళ్ళను సినిమాల్లో ఉంచాలని కోరుతున్నారు.

ఈ మధ్య ఇది మరీ ఎక్కువై హీరోయిన్లను కూడా అక్కడి వాళ్ళనే ఉంచే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారట. కొందరు అగ్ర హీరోలు అయితే దీన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు అందరూ కూడా హీరోల డిమాండ్ ని దృష్టి లో పెట్టుకుని… తమకు కూడా లాభం ఉంటుంది కాబట్టి ఇతర భాషల్లో ఉన్న స్టార్ హీరోలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news