ఆ పాత్రలు చేయడానికి రెడీ అని చెప్పేసిన భూమిక…!

-

ఈ మధ్య కాలంలో సినిమాల్లో పాత హీరోయిన్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ తమ తమ సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఆధారంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ, భూమిక సహా మరికొందరు తమ పాత్రలో కాస్త వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రమ్యకృష్ణ ఇప్పటికే చాలా సినిమాల్లో తన ప్రాధాన్యత ఏంటో స్పష్టంగా చెప్పేసింది నరసింహ నుంచి బాహుబలి వరకు.

బాహుబలి సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తాను కూడా అలాంటి పాత్రలు చేస్తా అని, తనకు విలన్ గా అవకాశాలు వస్తే కచ్చితంగా చేయడానికి సిద్దంగా ఉన్నా అని భూమిక తెలిపింది. ఇటీవల ఆమె బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ గా ఉన్నా అని చెప్పింది. ఇప్పుడు కథ డిమాండ్ చేస్తే కచ్చితంగా విలన్ పాత్రలు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నా అని స్పష్టం చేసింది.

ఆమెకు ప్రస్తుతం ఒక సినిమాలో నెగటివ్ రోల్ వచ్చినట్టు సమాచారం. అది కూడా విలన్ గా వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలో ఆమె బిజీ గా ఉందని, ప్రస్తుతం బరువు పెరిగే పనిలో బిజీ గా ఉందని అంటున్నారు. ఆమె పాత్ర ఆధారంగానే సినిమా నడుస్తుంది అంటున్నారు. కరోనా దెబ్బకు ఆ సినిమా షూటింగ్ వాయిదా పడిందని త్వరలోనే షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఆమె భారీగా డిమాండ్ చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news