అయ్యో పాపం.. అప్పుడు సమంత​.. ఇప్పుడు దీపిక​.. అలా జరగడానికి కారణం అదేనట!

-

‘అభి’ అనే కన్నడ చిత్రం ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన దివ్య స్పందన అదే ఏడాది ‘అభిమన్యు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అయితే ఎక్కువగా కన్నడ, తమిళ చిత్రాలకే పరిమితమైన దివ్య.. తమిళ్‌లో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సూర్యతో తెరకెక్కించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇలా సినిమాల్లో రాణిస్తూనే 2012లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె.. 2013 బై ఎలక్షన్స్‌లో కర్ణాటకలోని మాండ్య నుంచి ఎంపీగా గెలుపొందింది. మొత్తానికి పాలిటిక్స్‌లో కొనసాగుతూనే అడపాదడపా కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా దేశంలో ఉమెన్ ఫ్రీడమ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్త్రీ ద్వేషంతోనే పలువురు హీరోయిన్​ దీపికా పదుకొణెను ట్రోల్‌ చేస్తున్నారని రమ్య అన్నారు. స్త్రీ వ్యతిరేకతపై ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘బేషరమ్‌ రంగ్‌’ పాట వివాదంపై స్పందించిన ఆమె.. సమంత, రష్మిక పేర్లను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఆయా నటీమణులు ఏ విషయంలో ట్రోల్స్‌ ఎదుర్కొన్నారో చెప్పారు.

“విడాకులు తీసుకుందనే కారణంతో సమంతను అప్పట్లో ట్రోల్‌ చేశారు. అలాగే, తన అభిప్రాయాన్ని బయటపెట్టినందుకు సాయిపల్లవి, ఓ నటుడి నుంచి విడిపోయినందుకు రష్మిక, కురచ దుస్తులు వేసుకుందని దీపిక.. ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది మహిళలు ఇలాంటి చిన్న చిన్న కారణాలకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. దుర్గాదేవి ప్రతిరూపాలే మహిళలు. స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది” అని రమ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కన్నడలో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించిన రమ్య.. ‘అభిమన్యుడు’తో తెలుగు తెరకు పరిచయమ్యారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news