భారత జవాన్లను ఎంత పొగిడినా సరిపోదు – రాజ్ నాథ్ సింగ్

-

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న భారత జవాన్ల సేవలను ఎంత పొగిడినా సరిపోదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో జరిగిన పరిశ్రమల సమాఖ్య ఫిక్కి 95 వ వార్షిక సదస్సులో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ను సూపర్ పవర్ గా మార్చడానికి అవసరమైన ఐదు అంశాల గురించి ప్రధాని మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో తెలిపారని గుర్తు చేశారు.

opposition slams Rajnath singh russia tour
opposi

అయితే ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడం కోసమో లేదా ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం కోసమో, అత్యంత శక్తివంతమైన దేశంగా మారాలని అనుకోవడం లేదన్నారు. ప్రపంచ సంక్షేపం కోసమే భారత్ పనిచేయాలనుకుంటుందని వివరించారు. గల్వన్ అయినా, తవాంగ్అయినా మన రక్షణ బలగాలు తమ శౌర్య పరాక్రమాలను నిరూపించుకున్నాయని కొనియాడారు.

చైనా సరిహద్దు పరిస్థితుల అంశంలో కేంద్రంపై విమర్శలకు ఇప్పిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కూడా రాజ్నాథ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఉద్దేశం ఏమిటో మేము ఎప్పుడూ ప్రశ్నించలేదని.. వారి విధానాలపైనే చర్చ జరిపామన్నారు. పార్టీల విధానాలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలి కానీ వాస్తవాలను వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయకూడదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news