వర్కౌట్లతో భయపెట్టిస్తున్న హీరోయిన్ ప్రణీత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి బాపు బొమ్మగా కూడా పేరు పొందింది. అందం ,అభినయం రెండు ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. ఇక సోషల్ మీడియాలో కూడా పలు పోస్టులు షేర్ చేస్తూ అప్పుడప్పుడు పలు వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా తను చేస్తున్న కొన్ని వర్కౌట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

కరోనా సమయంలో ప్రణీత వివాహం చేసుకుని ఆ తర్వాత ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. ప్రణీత తిరిగి సినిమాలలో నటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఇలాంటి జిమ్ వర్క్ అవుట్లను సైతం చేస్తూ ఉన్నది. ప్రణీత ఈ జిమ్ వర్క్ లో కొన్ని వెరైటీ వర్కర్లను కూడా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రణీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

చివరిగా అత్తారింటికి దారేది సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రణీత ఆ తర్వాత తన నటించిన ఏ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు.

ప్రణీత సినిమాలలో హీరోయిన్ గానే కాకోకుండా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది. ప్రణీత అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల పైన కూడా స్పందిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రణీత షేర్ చేసినటువంటి ఫోటోలు చూసిన వారంతా అజంతా శిల్పం లా ఉందంటు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మను బాపు బొమ్మ అని పిలుస్తూ ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)