లక్ ఉండాలే కానీ.. రాత్రికి రాత్రే మన తలరాత మారిపోతుంది. ఓవర్ నైట్ స్టార్స్‌ను చూసి ఉంటారు కానీ.. ఓవర్ నైట్‌లో కోటిశ్వరుడు అయినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా..! టైంపాస్‌కు కొన్న లాటరీ టికెట్లు తగిలాయి..చాలా గట్టిగా కొట్టాడు.. ఇలాంటి వార్తలు విన్నప్పుడు అబ్బా మనం కూడా లాటరీ టికెట్లు కొంటే బాగుండేది అనిపిస్తుంది కదా..! అమెరికాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మేరీ ల్యాండ్‌కు చెందిన 67 ఏళ్ల వ్యక్తి లాటరీ టికెట్ కొనుగోలు చేయాలి అనుకున్నాడు. సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జరిగిన లాటరీ టికెట్ల అమ్మకంలో రెండు టికెట్లు కొనుగోలు చేశాడు. తన భర్త లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన విషయం భార్యకు తెలియకపోవడంతో తను కూడా ఓ టికెట్ కొన్నది. మొత్తంగా ఇద్దరు కలిసి మూడు టికెట్లను కొనుగోలు చేశారు. లాటరీ ఫలితాలు వచ్చాయి. అదృష్టం జమైకన్ చిరుత హుస్సేన్ బోల్ట్ లా పరిగెత్తుకుంటూ వచ్చింది. మూడు లాటరీ టికెట్లు కొన్న భార్య భర్తలను చుట్టేసుకుంది. వీరు కొన్న మూడు టికెట్లు లాటరీ డ్రాలో విజయం సాధించాయి అమ్మో ఒక్క టికెట్ తగలడమే గొప్ప విషయం అంటే మూడు కొంటే మూడు తగిలాయి.. ఈ విజయం ద్వారా అక్షరాలా 1,50,000 అమెరికన్ డాలర్లు దక్కించుకున్నారు. భారత కరెన్సీలో సుమారు రూ. కోటి 13 లక్షలు సొంతం చేసుకున్నారు.
అనుకోకుండా కొన్న మూడు టికెట్ల ద్వారా ఇంత మనీ వస్తుందని వాళ్లు అసలు ఊహించలేదట.. అమెరికాలో లాటరీ డ్రాలలో విజేతలుగా నిలిచి భారీ డబ్బులను పొందిన వారు చాలా మంది ఉన్నారు. 2018లో న్యూజెర్సీలోని ఎడ్జ్ వాటర్‌కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్ సైతం వరుసగా మూడు లాటరీలను గెలిచి భారీ మొత్తంలో డబ్బును గెలుచుకున్నాడు. ఈ మూడు లాటరీలకు గాను తను ఏకంగా 5 మిలియన్ డాలర్లను అందుకున్నాడు. ఇండియన్ కరెన్సీలు ఈ డబ్బు విలువ సుమారు రూ. 36.2 కోట్లు. న్యూజెర్సీలో మూడుసార్లు లాటరీ అదృష్టం వరించిన వ్యక్తిగా స్టీవర్ట్ గుర్తింపు పొందాడు.