హీరోయిన్ సంఘవి మొదటి వివాహం వెనుక ఇంత విషాదమా..?

-

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏ ఒక్క హీరోయిన్ కూడా చిరకాలం పాటు కొనసాగుతుంది అనడంలో చాలా సందేహాలు వ్యక్తం అవుతాయి. ఎందుకంటే కొంతమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..బాగా రాణించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు అనుకునే లోపే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ సంఘవి కూడా ఒకరు. మొదట్లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకునే లోపే ఒక డైరెక్టర్ ను ప్రేమించి.. వివాహం చేసుకొని ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇకపోతే ఈమె మొదటి వివాహం వెనుక ఉన్న విషాదం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

ఇకపోతే సంఘవి కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగు, తమిళ్ , కన్నడ భాషలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె తండ్రి వృత్తిపరంగా డాక్టర్. ఇక తనను కూడా డాక్టర్ చేయాలని తన తండ్రి ఎన్నో కలలు కన్నారట. కానీ సంఘవి కి డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండడం చేత తనకు డాన్స్ నేర్పించాలని ఆయన భావించారు. ఇక అలా డాన్స్ స్కూల్ కి పంపించినప్పుడు ఈమె డాన్స్ చూసిన డైరెక్టర్ సెల్వ ఏకంగా ఈమె ను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక అలా మొదలైన తన సినీ కెరియర్ ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ భాషలలో పలు సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో 1998లో శివయ్య సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ సురేష్ వర్మతో ఈమె ప్రేమలో పడ్డది.

ఇక ఈ ప్రేమ కాస్త చివరికి పెళ్లిగా మారి వివాహం చేసుకున్న తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంది సంఘవి. ఇక ఆ తర్వాత ఆ డైరెక్టర్ తో తన జీవితాన్ని కొనసాగించలేక విడాకులు తీసుకుంది. ఇక సుమారుగా కొన్ని సంవత్సరాలు పాటు విరామం తీసుకుని బెంగళూరులో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. ఇకపోతే 42 సంవత్సరాల వయసులో ఈమె ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం అందరికీ షాక్ తగిలిందని చెప్పవచ్చు . ఏది ఏమైనా ప్రస్తుతం సంఘవి ఆ బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ జీవితాన్ని ఆ పాపకే అంకితం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version