పెళ్లయిన హీరోతో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ శ్రీదివ్య..!!

-

చైల్డ్ యాక్టర్ గా మొదట తన కెరీర్ ని ప్రారంభించింది హీరోయిన్ శ్రీదివ్య.. దాదాపుగా చైల్డ్ యాక్టర్ గాని 10 సినిమాలలో నటించిన శ్రీదివ్య ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.. అంతేకాకుండా తెలుగమ్మాయి అవ్వడం వల్ల పలు సినిమాలలో నటించే అవకాశాలు తక్కువగా వచ్చాయి.. 17 ఏళ్ల వయసులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు శ్రీదివ్యకు మరే సినిమాలో కూడా అవకాశం రాలేదు..

ఆ వెంటనే బస్ స్టాఫ్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఈమె నటించిన కేరింత సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోని మరింత పాపులారిటీ అందుకుంది..తెలుగులో అవకాశాలు రావడం లేదని కోలీవుడ్ వైపుగా వెళ్లిన శ్రీదివ్య అక్కడ మంచి అవకాశాలు అందుకొని హీరోయిన్గా సెటిల్ అయ్యింది.. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో పెళ్లయిన ఒక స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..ఆ హీరో ఎవరో కాదు నటుడు శివ కార్తికేయన్

శ్రీదివ్య, శివ కార్తికేయన్ కలిసి కాకిసతై, వరుతపడతా, వాలిబార్ సంఘం తదితర తమిళ సినిమాలలో నటించారు.. అయితే సినిమాలలో నటించే సమయంలో శ్రీదివ్యకి , శివకార్తికేయన్ కి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట.. అయితే అప్పటికే శివకార్తికేయన్ కి పెళ్లయిపోవడంతో వీరిద్దరి మధ్య ఉండే సీక్రెట్ బంధం గురించి కొద్ది రోజులు కోలీవుడ్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ విషయం శివ కార్తికేయన్ భార్యకు తెలిసి ఇంట్లో చాలా గొడవలు కూడా అయ్యాయట.. ఇక అప్పటినుంచి శ్రీ దివ్యకి, శివ కార్తికేయన్ కి దూరంగా ఉందట. అయితే వీరిద్దరి కాంబినేషన్లు వచ్చిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో దర్శక నిర్మాతలు సైతం శివ కార్తికేయనుకు జోడిగా శ్రీదేవి అని సూచించగా ఆమె వద్దని చెప్పాడట.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version