షూటింగ్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన హీరోయిన్ టబు..

అలనాటి సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగు బడా హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉండగా, తాజాగా బుధవారం “బోలా” సినిమా సెట్స్ లో నటి టబు తీవ్రంగా గాయపడింది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న బోలా సినిమాలో టబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ఒక ఫైట్ సీన్ కోసం స్టెంట్ చేస్తూ ఉండగా గాయపడింది.

టబు నుదుటిపై అలాగే కంటిపైన గాయమైందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోందని అంటున్నారు. షూటింగ్ సమయంలో టబు ఒక దట్టమైన అడవిలో ట్రక్కును నడుపుతోంది. అదే సమయంలో మోటార్ సైకిల్ పై కొందరు దుండగులు ఆ ట్రక్కును వెంబడిస్తూ ఉంటారు.

సినిమా షూటింగ్ లో భాగంగానే ఇది జరుగుతూ ఉండగానే ఆ ట్రక్కును వెంబడిస్తున్న బైకులలో ఒకటి ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. అలా ఢీకొన్న సమయంలో ఒక గాజు ముక్క పగిలి టబును తాకింది. ఆ సమయంలో టబు ట్రక్కులో ఉందని అంటున్నారు. టబు కుడి కన్ను పైన ఒక గాజు ముక్క తగిలిందని, ఘటనా స్థలంలో ఉన్న వారు చెప్పినట్టు తెలుస్తోంది. టబు కుడి కన్ను పైన ఆ గాజు ముక్క కోసుకుపోయిందని, అక్కడి నుంచి రక్తం కారుతోంది. కానీ అదృష్టవశాత్తు కుడి కనుబొమ్మ పైన గాయమైంది. అదే కంటికి తగిలి ఉంటే అది పెను ప్రమాదం అయి ఉండేదని అంటున్నారు.