మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతోంది..!!

-

మిల్కీ బ్యూటీ తమన్నా  సినిమాకు పరిచయం అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా తన గ్లామర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈమె స్ట్రక్చర్ చూసి సాటి హీరోయిన్స్ అసూయ చెందే వారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఇంకా అందమైన యంగ్ హీరోయిన్ గా కనపడుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంది.

ఇక ఎప్పటి నుండో విజయ్ వర్మ అనే నటుడి తో ప్రేమాయణం నడుపుతూ ఉందని ప్రచారం జరిగింది. వారిద్దరూ బీచ్ లకు, పబ్బులకు కూడా కలసి తిరుగుతూ ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకో బోతున్నారు అంటూ సన్నిహితుల ద్వారా సమాచారం వినిపిస్తోంది.

ఇక తాజాగా మరోసారి స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం బయటపడింది. నిన్న ముంబైలో నిర్వహించిన ఎల్లే అవార్డ్స్ ఫంక్షన్ లో నటుడు విజయ్ వర్మతో కలిసి ఫంక్షన్ కు వచ్చింది ఈ సుందరి. ఫంక్షన్ లో  వీరి జంట ఈవెంట్ లో ఆకర్షణీయంగా మారింది. ఇక ఎక్కడకి వెళ్ళినా చేతిలో చేయి వేసి నడుస్తూ కూడా కనిపించారు. వీరిని చూసి ఇక పెళ్లే తరువాయి అని కామెంట్స్ వచ్చాయి. తమన్న వేసుకున్న డ్రెస్ కూడా లోపలి అందాలు చూపిస్తూ తెగ ఇంపుగా సొంపుగా ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news