డీ-గ్లామర్ పాత్రలలో నటించేందుకు ముద్దుగుమ్మల సుముఖత..!

Join Our COmmunity

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గ్లామరస్ కనిపించేందుకు తిండి దగ్గరి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందంగా కనిపించేందుకు అంతలా ఆరాటపడుతుంటారు. షూటింగ్ కాస్త గ్యాప్ దొరికితే చాలు టచప్ అంటూ మేకప్ మెన్ లను పిలుస్తుంటారు. అయితే ఇది ఒకప్పుడు.. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మల ధోరణి మారిందనే చెప్పుకోవచ్చు.

kirthi suresh
kirthi suresh

మూవీ కంటెంట్ నచ్చిందంటే చాలు డీ-గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో సమంత, నయనతార, ఐశ్వర్య రాజేశ్, తాప్సీ తదితరులు మేకప్ లేకుండానే ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించారు. దీంతో కీర్తి సురేశ్, రష్మిక, ప్రియమణి తదితరులు డీ-గ్లామరస్ పాత్రలతో ఫిదా చేయడానికి సిద్ధమవుతున్నారు. నటి సమంత నటించిన పాత్రలు అన్ని ఒకెత్తయితే.. ‘రంగస్థలం’ సినిమాలో ఆమె నటన మరో ఎత్తనే చెప్పుకోవచ్చు. పల్లెటూరి అమ్మాయి ‘రామలక్ష్మి’లా కనిపించిన తీరు అభిమానుల్ని ఎంతో అలరించింది. దీంతో పాటు సమంత తన తొలి వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మెన్-2’లోనూ డీ-గ్లామర్ రోల్ చేస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి దిగువ మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా లంగావోణి వేసుకుని షూటింగ్ స్మాట్ లో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి కమర్షియల్ హిట్ సినిమాల తర్వాత నటి కీర్తి సురేశ్ ఆసక్తికరమైన పాత్రలో నటించనున్నారు. ‘సాని కాయిధమ్’ సినిమాలో కీర్తి డీ-గ్లామర్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టరులో కస్టడీలో ఉన్న దోషిలా.. ఆమె పక్కనే ఆయుధాలు కనిపిస్తుంటాయి.

‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి హెబ్బా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు. ప్రస్తుతం హెబ్బా ‘ఓదెలా రైల్వే స్టేషన్’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె చీర కట్టుకుని పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. ‘పుష్పా’ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందనా డీ-గ్లామర్ పాత్రకు సిద్ధమైనట్లు సమాచారం. హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రం ‘నారప్ప’లో కూడా నటి ప్రియమణి పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతున్నారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news