హిప్పీ డిజాస్ట‌ర్ దెబ్బ‌.. కార్తికేయకు అస‌లు విష‌యం ఇప్పుడు తెలిసి ఉంటుంది..!

-

హిప్పీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ దాదాపుగా అర గంట పాటు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆర్ఎక్స్ 100 మూవీకి హిప్పీ మూవీ ప‌దింతల ఎక్కువ హిట్‌ను ఇస్తుంద‌ని అత‌ను చెప్పాడు.

ఏ రంగంలోనైనా స‌రే.. ఎవ‌రైనా స‌రే.. తొలిసారి విజ‌యం సాధించిన‌ప్పుడు మిడిసి ప‌డ‌కూడ‌దు. ఆత్మ‌విశ్వాసం ఉండాలే కానీ.. త‌మ‌పై త‌మ‌కు అతి విశ్వాసం ఉండ‌కూడ‌దు. అతి చేయ‌కూడ‌దు.. అలా చేస్తే ఫలితం కూడా షాకింగ్‌గా వ‌స్తుంది. ప్ర‌స్తుతం న‌టుడు కార్తికేయ కూడా దాదాపుగా ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నాడు. త‌న మొద‌టి సినిమా ఆర్ఎక్స్ 100 హిట్ అయింద‌ని చెప్పి ఈ హీరో భూమి మీద నిల‌వ‌లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా వ‌చ్చిన హిప్పీ మూవీ ఆర్ఎక్స్ 100 క‌న్నా ప‌దింతల ఎక్కువ హిట్‌ను ఇస్తుంద‌ని ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు. కానీ ప‌రిస్థితి చూస్తే మాత్రం మ‌రీ దారుణంగా ఉంది.

హిప్పీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ దాదాపుగా అర గంట పాటు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆర్ఎక్స్ 100 మూవీకి హిప్పీ మూవీ ప‌దింతల ఎక్కువ హిట్‌ను ఇస్తుంద‌ని అత‌ను చెప్పాడు. తాను ఒక అద్భుత‌మైన సినిమా చేశాన‌ని.. ఆ సినిమా న‌భూతో న భ‌విష్య‌త్ అన్న రీతిలో ఉంటుంద‌న్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చాడు. అయితే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్రేక్ష‌కులు సినిమాను ఛీకొట్టారు. దీంతో హిప్పీ మూవీ నిర్మాత‌లు త‌ల‌లు పట్టుకుంటున్నారు.

హిప్పీ మూవీకి ఘోరమైన ఫ్లాప్ టాక్ రావ‌డ‌మే కాదు, వ‌సూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. తెలంగాణ‌లో 3 రోజుల్లో ఏ ఒక్క రోజూ రూ.10 ల‌క్ష‌ల షేర్ రాలేదు. అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.1 కోటి షేర్ కూడా రాలేదు. దీంతో చిత్ర నిర్మాత క‌లైపులి థానుకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేద‌ట‌. సినిమాను రూ. కోట్లు పెట్టి తీస్తే చిల్ల‌ర వ‌స్తుంద‌ని చిత్ర యూనిట్ ఆవేద‌న వ్యక్తం చేస్తోంది. అవును మ‌రి.. బూతు డైలాగులు, రొమాంటిక్ సీన్లు, అస‌భ్య‌క‌ర దుస్తులు వేసుకుని నాలుగు షాట్లు తీసి జ‌నాల మీద‌కు వ‌దిలితే అది సినిమా అవుతుందా..? సినీ ప్రేక్ష‌కులు ఏమీ వెర్రివాళ్లు కాదు క‌దా.. ఇక‌నైనా నిర్మాత‌లు ఇలాంటి ధోరణి వ‌దలిపెట్టి క‌థాప‌రంగా ప‌ట్టున్న సినిమాలు తీస్తే క‌నీసం పెట్టిన డ‌బ్బులైనా వెన‌క్కి వ‌స్తాయి. లేదంటే.. ఇదిగో ప‌రిస్థితి హిప్పీ మూవీలాగే త‌యార‌వుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version