స‌రికొత్త రికార్డుల దిశ‌గా స‌ల్మాన్ భార‌త్‌..!

-

తొలి రోజు (బుధవారం) దేశవ్యాప్తంగా రూ.42.30 కోట్లు, గురువారం రూ.31 కోట్లు, శుక్రవారం రూ.22.20 కోట్లు, శ‌నివారం రూ.26కోట్లతో మొత్తంగా నాలుగు రోజుల‌కు రూ.120 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

స‌ల్మాన్ ఖాన్ సినిమాలు బాగుంటూ సృష్టించే రికార్డులు అన్నీ ఇన్నీకావు. తాజా ఆయ‌న న‌టించిన ‘భారత్’ బాక్సాఫీసు వద్ద స‌రికొత్త రికార్డుల దిశ‌గా దూసుకుపోతుంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.వంద కోట్ల‌ని దాటింది.

ఇది తొలి రోజు (బుధవారం) దేశవ్యాప్తంగా రూ.42.30 కోట్లు, గురువారం రూ.31 కోట్లు, శుక్రవారం రూ.22.20 కోట్లు, శ‌నివారం రూ.26కోట్లతో మొత్తంగా నాలుగు రోజుల‌కు రూ.120 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఇది కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువ కావడం విశేషమని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ పరంగా గతంలో ఈద్‌కు విడుదలైన సల్మాన్‌ ‘టైగర్‌ జిందా హై’ (రూ.34.10 కోట్లు), ‘సుల్తాన్‌’ (రూ.36.54 కోట్లు), ‘ప్రేమ్‌ రథన్‌ ధన్‌ పాయే’ (రూ.40.35 కోట్లు)లను ‘భారత్’ (రూ.42.30 కోట్లు) అధిగమించింది. వంద‌కోట్లు వ‌సూలు చేసిన తొమ్మిదో సినిమా కావ‌డం విశేషం. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, దిశా పటానీ కథానాయికలు. కొరియన్‌ సినిమా ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కిది రీమేక్ అన్న విష‌యం విదిత‌మే. ఇది యుక్త వ‌య‌సు నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు ఐదు భిన్న కాలాల్లో, విభిన్న ప‌రిస్థితుల్లో భార‌త్ చేసే జ‌ర్నీ నేప‌థ్యంలో రూపొందింది. భార‌త్‌గా స‌ల్మాన్ ఐదు భిన్న గెట‌ప్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

ప్రస్తుతం సల్మాన్‌ ‘దబాంగ్‌ 3’లో నటిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. త్వ‌ర‌లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇన్‌షాల్లా ప్రారంభం కానుంది. అయితే బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, సంజరులీలా భన్సాలీ కాంబినేష‌న్‌కి మంచి పేరుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖామోషి: ది మ్యూజికల్‌’, ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాల్ని సాధించాయి. ఆయ‌న అతిథి పాత్ర పోషించిన సావ‌రియా సైతం మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ నేప‌థ్యంలో దాదాపు ఇరవై ఏండ్ల తర్వాత వీరిద్ద‌రు హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

సల్మాన్‌ హీరోగా ‘ఇన్‌షాల్లా’ పేరుతో ఓ సినిమాని రూపొందించబోతున్నట్టు భన్సాలీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు తెలిపే పోస్టర్‌ని అలియాభట్ ఇటీవ‌ల తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అబిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో సల్మాన్‌ సరసన అలియాభట్‌ కథానాయికగా ఎంపికైన విషయం విదితమే. తొలిసారి వీరిద్దరూ సిల్వర్‌ స్క్రీన్‌ని షేర్‌ చేసుకోబోతున్నారు. భన్సాలీ సినిమాలంటే అబ్బురపరిచే విజువల్స్‌కి కేరాఫ్‌. మరి ఈ సినిమాని ఎంత అందంగా, ఎంతటి విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్ద బోతున్నారనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version