Hit -3: సినిమాలో సమంత..?

-

హీరో అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హీట్ -2. ఈ సినిమాకి నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. డిసెంబర్ రెండవ తేదీన ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హీట్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. డైరెక్టర్ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చూపించడం జరిగింది. దీంతో ఇప్పటికే ఈ సినిమా క్యూరియాసిటీ నెలకొన్న హీట్ -3 సినిమాలో నాని హీరోగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించబోతున్నట్లు సమాచారం. హీట్ -2 సినిమాలో అడవి శేషు అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రశంశాల వర్షం అందుకున్నారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా నేటిజనులతో చిట్ చాట్ చేయడం కూడా జరిగింది. ఇందులో ఒక నెటిజన్ హీట్ -3 సినిమాలో సమంత లీడ్ రోల్ యాక్షన్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం జరిగిందట.అందుకు అడవి శేషు స్పందిస్తు.. ఇది అద్భుతమైన ఆలోచన నువ్వేమంటావు సమంత అంటూ ఒక ట్యాగ్ ను చేయడం జరిగింది.

ఈ ప్రశ్నకు సమంత రియాక్ట్ అవుతూ ఇది వినడానికి చాలా సరదాగా ఉన్నప్పటికీ.. అవకాశం వస్తే ఖచ్చితంగా ముందుగా మీరు సూపర్ హిట్ అందుకున్న సినిమాకు శుభాకాంక్షలు అంటూ రిప్లై ఇచ్చింది. మరి సమంత హిట్ 3 సినిమాల నటిస్తుందేమో తెలియాల్సి ఉంది. హీట్-3 సినిమాలో అడవి శేషు తోపాటు,నాని కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news