అరవింద సమేత.. సునీల్ కు గట్టిగానే ఇచ్చారు

-

కమెడియన్ గా సూపర్ ఫాంలో ఉండగా సునీల్ హీరో అవ్వాలన్న కోరిక కలిగింది. సడెన్ గా అందాల రాముడు అంటూ హీరో అవతారమెత్తాడు. హీరోగా చేస్తూనే కామెడీ రోల్స్ చేయొచ్చు కాని మనోడు అలా కుదరదని కేవలం సోలో హీరోగా ట్రై చేశాడు. చివరకు తన వల్ల కాదని మళ్లీ తన పాత పంథాకు వచ్చాడు. హీరోగా ఏమాత్రం సక్సెస్ ఫుల్ కెరియర్ ను కొనసాగించలేని సునీల్ మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకున్నాడు.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ పక్కన ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు సునీల్. రీసెంట్ గా రిలీజైన టీజర్ లో సునీల్ అలా ఒక్క క్షణం అలా కనిపించి మాయమయ్యాడు. ఈ సినిమాకు సునీల్ రెమ్యునరేషన్ గా రోజుకి 3.5 లక్షల చొప్పున తీసుకున్నాడట. హీరోగా ప్యాకేజ్ మాట్లాడుకునే స్థాయి నుండి రోజు వారి రెమ్యునరేషన్ కు వచ్చాడు.

అయితే రోజుకి మూడున్నర లక్షలంటే తక్కువేం కాదు. చెప్పాలంటే సునీల్ క్రేజ్ ఇంకా అదే రేంజ్ లో కొనసాగుతుందని తెలుస్తుంది. త్రివిక్రం ఎలాగైనా సరే ఈ సినిమాతో సునీల్ కు లైఫ్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి అరవింద సమేత సునీల్ ఆశలను నిజం చేస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version