తాప్సీ : రియా చక్రవర్తి ఎవరు..?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి రిమాండ్ లో ఉంది. అలాగే ఆమె తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకి వస్తున్నాయి. అలాగే ఈ  వ్యవహారానికి సంబంధించి రోజుకో కొత్తం అంశం తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని వెల్లడించింది. కంగనా మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని తాప్సి స్పష్టం చేసింది. అసలు రియా ఎవరో కూడా తనకు తెలియదని తాప్సీ పేర్కొంది. ఇకపోతే గతంలో తాప్సీ, రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.