నాగార్జున గనక ఈ నిర్ణయం తీసుకుంటే టాలీవుడ్ కి పెద్ద షాకే ..?

-

టాలీవుడ్ లో కింగ్ నాగార్జున, మన్మధుడు ఇలాంటి పేర్లతో అక్కినేని నాగార్జున ఎంతటి క్రేజ్ ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వర రావు తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నారు నాగార్జున. ఇక అమ్మాయిలకి గ్రీకు వీరుడు. బిజినెస్ లో కింగ్, హీరోయిన్స్ కి మన్మధుడు. ఈ మన్మధుడు ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకొని సీనియర్స్ తో పాటు జూనియర్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చారు. అంతెందుకు తన ఇద్దరు కొడుకులతో ఇప్పటికీ పోటీ పడుతుంటారు. ఒకేసారి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ సినిమాలు రిలీజైతే ఖచ్చితంగా నాగార్జున సినిమాకే ప్రేక్షకులు వెళతారనడం లో ఏమాత్రం సందేహం లేదు.

ఇక ప్రయోగాలు చేయడంలో నాగార్జున తర్వాతే టాలీవుడ్ లో ఏ హీరోయినా. కొత్త దర్శకులకి అవకాశాలు ఇవ్వడంతో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో కూడా నాగార్జున అందరికంటే ముందుంటాడు. నాగార్జున అలా అవకాశాలు ఇవ్వడం వల్లే ఈ రోజు ఇండస్ట్రీలో రాం గోపాల్ వర్మ, రాఘవ లారెన్స్ లాంటి దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు. అన్నపూర్ణ నిర్మాణ సంస్థ అంటే కొత్త వాళ్ళందరికి “అమ్మ” లాంటిదే అని ఎంతో మంది చెబుతుంటారు.

అలాగే ఈ నిర్మాణ సంస్థ ద్వారా దర్శకులు, సంగీత దర్శకులు, నటీ నటులు, ఇతర టెక్నీషియన్స్ ఎంతో మంది ఇండస్ట్రీకొచ్చి సెటిలయ్యారు. అయితే గత కొంతకాలంగా నాగార్జున నటించిన సినిమాలన్ని వరుసబెట్టి ఫ్లాపవుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత మళ్ళీ సక్సస్ ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది 2, నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దేవదాసు, సినిమాలు చేసినప్పటికి ఆ సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇక మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బ్యూటీతో రొమాన్స్ చేసినప్పటికి ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

అంతేకాదు ఈ ఏజ్ లో ఇలాంటి సినిమాలేంటి అన్న నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ లో మరో సారి పోలీస్ పాత్రలో ఒక సినిమా చేస్తున్నారు. అయితే నాగార్జున ఇక హీరోగా సినిమా మానేసి నిర్మాతగా నాగచైతన్య, అఖిల్ ల తో సినిమాలు నిర్మిస్తూ వాళ్ళు స్టార్స్ అయ్యోలా జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందన్న టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమై నాగార్జున హీరోగా సినిమాలు మానేస్తే నలుగురు సీనియర్ హీరోల్లో ఒకరు రిటైరయినట్టు అవుతుంది. ఇదే జరిగితే మాత్రం టాలీవుడ్ కి పెద్ద షాకే. కాని అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అందుకు ఒప్పుకోవడానికి రెడీగా లేరని నాగార్జున హీరోగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news