మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూనే మరొకవైపు వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలలో కూడా మరింత బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఉండగా కుమార్తె జన్మించిన తర్వాత మొదటిసారి తన భర్త రామ్ చరణ్ తో కలిసి బయటకు వచ్చింది.ఇటీవల ఒక వివాహ వేడుక నిమిత్తం ఫారిన్ వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇటీవల ఈ జంట విదేశాలకు వెళ్ళగా ఏదైనా వేకేషన్ కి వెళ్లారని అందరూ అనుకున్నారు. అయితే ఇలా వివాహానికి వెళ్ళినట్టు ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే మొదటిసారి ఫారెన్ వెళ్లడంతో వీరు ఎయిర్పోర్టులో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వగా ఆ ఫోటోలలో ఉపాసన చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. లైట్ పింక్ డ్రెస్ లో ఎంబ్రాయిడరీ జాకెట్ తో కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించింది. ఉపాసన ధరించిన డ్రెస్ హేలీ మెన్జీస్ డిజైనర్ కు సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్.
ఇందులో ఉపాసన చాలా చక్కగా మరింత అందంగా కనిపించారు. దీంతో అందరి దృష్టి ఉపాసన ధరించిన డ్రెస్ పైనే పడింది. ఈ నేపథ్యంలోని దీని ఖరీదు ఎంత ఉంటుందని అందరూ తెగ ఆలోచిస్తున్నారు.ఇకపోతే ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.42,317 అన్నట్లు తెలుస్తోంది. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా అన్ని వేల రూపాయలని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram