చంద్రబాబు అరెస్ట్ ఐతే… ప్యాకేజీ రాదని రోడ్ల మీద పవన్ దొర్లేశాడు – ద్వారంపూడి

-

చంద్రబాబు అరెస్ట్ ఐతే… ప్యాకేజీ రాదని రోడ్ల మీద పవన్ దొర్లేశాడంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చురకలు అంటించారు. జైలులో చంద్రబాబుకు ఒక నెంబర్ వచ్చిందని.. నేను ఏ తప్పు చేసినా ఎవరూ ఏం చేయ్యలేరని మొన్నటి వరకు విర్రవీగిపోయే వాడని గుర్తు చేశారు ద్వారంపూడి. వ్యవస్థ లను మేనేజ్ చేయగలను అని పొగరు తో ఉండేవాడు.. ఏదైనా చేయడం లో నేర్పరి.. అలాంటి వ్యక్తి స్కిల్ స్కామ్ లో దొరికిపోయాడన్నారు.

Dwarampudi
Dwarampudi

నిన్నటి ఎపిసోడ్ తో న్యాయ వ్యవస్ధపై గౌరవం పెరిగిందని..చంద్రబాబు అరెస్ట్ మంచి పరిణామం అంటూ ఎద్దేవా చేశారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ను అరెస్ట్ చేసిన వెంటనే పురంధేశ్వరి, పవన్ కళ్యణ్ చాల ఆత్రుతతో ఆందోళన చెందారని..పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్ కి ప్యాకేజీ పెరిగి ఉంటుందన్నారు. ఎన్టీఆర్, వంగావీటి రంగ ఆత్మలు శాంతించే రోజు అని.. ముద్రగడ కుటుంబాన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి తరలించాడో..అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు వెళ్ళాడని చురకలు అంటించారు ఎమ్మెల్యే ద్వారంపూడి.

Read more RELATED
Recommended to you

Latest news