అవకాశం కావాలంటే పడుకోమన్నారు – సింగర్ ప్రణవి..!

-

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అధికంగా ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయం గురించి అందరికీ తెలిసినా .. ఎవరూ కూడా బహిరంగంగా దీని గురించి చెప్పడానికి ఇష్టపడరు. కారణం? అవకాశాలు పోతాయేమో అన్న భయం.. మరొకవైపు వారి గుర్తింపుకు భంగం కలుగుతుందేమో అన్న కారణాల చేత తాము క్యాస్టింగ్ కౌచ్ సమస్యకు ఎదురుపడినా కూడా బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని మీటూ ఉద్యమం వచ్చినా కూడా కొంతమంది భయపడుతుంటే.. మరికొంతమంది మాత్రం నిర్భయంగా తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెబుతున్నారు.

అలాంటి వారిలో సింగర్ ప్రణవి కూడా ఒకరు అని చెప్పాలి. ముఖ్యంగా అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని కమిట్మెంట్స్ అడిగారని పలువురు సెలబ్రిటీలు కూడా మీడియా సమావేశంలో తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రణవి కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ప్రణవి తన భర్త రఘు మాస్టర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించింది. ప్రణవి మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో ఒక డైరెక్టర్ నా గొంతు బాగుందని చెప్పి.. ఒక సినిమాలో పాట పాడడానికి పిలిచారు.

అయితే అతన్ని కలిసిన తర్వాత నాకు సినిమాలో పాటలు పాడే అవకాశం రావాలి అంటే ఒక రోజు రాత్రి తనతో గడపాలన్న ఉద్దేశంతోనే మాట్లాడారు అంటూ ఆమె తెలియజేసింది. ఇక ఈ విధంగా అవకాశం కావాలి అంటే తనతో ఉండాలంటూ ఆ వ్యక్తి అడగడం నాకు చాలా కోపాన్ని తెప్పించింది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది ప్రణవి. ఇక ప్రస్తుతం ప్రణవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news