IPL 2024 Auction : ఐపీఎల్ బరిలోకి మిచెల్ స్టార్క్ దిగనున్నాడు. స్టార్ పెసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024లో ఫ్యాన్స్ ను అలరించనున్నారు. ఈ ఏడాది జరిగే మినీ వేలంలో పాల్గొనేందుకు ఆతడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్టార్క్ కు ఐపీఎల్ లో మంచి రికార్డే ఉంది.

2014, 15లో ఆర్సిబి తరఫున ఆడారు. 24 ఐపీఎల్ మ్యాచుల్లో 34 వికెట్లు పడగొట్టారు. 2018లో KKR రూ. 9.4 కోట్లకు కొనుగోలు చేసిన ఒక్క మ్యాచ్ లోను ఆడలేదు. మళ్లీ ఇప్పుడు వేలంలోకి రావడంతో అతడి కోసం అన్ని జట్లు పోటీపడే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది చివరన అంటే డిసెంబర్ మాసం లో IPL 2024 మినీ Auction జరుగనుంది. దీంతో చాలా మంది ప్లేయర్స్ ఈ వేలం లో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నారు.