మహర్షి పై తమిళ హీరో కన్ను..!

-

తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలకు తమిళ, హింది భాషల్లో మంచి డిమాండ్ ఉంటుంది. స్టోరీ వెయిట్ ను బట్టి అక్కడ రీమేక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు తమిళంలోకి.. తమిళ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవడం సహజమే. అక్కడ ఇళయదళపతి విజయ్ ప్రత్యేకంగా మహేష్ సినిమాలను రీమేక్ చేస్తాడు. మహేష్ నటించిన ఒక్కడు, పోకిరి సినిమాలు విజయ్ తమిళంలో రీమేక్ చేసి సంచలన విజయం అందుకున్నాడు.

ఇక ఇప్పుడు మహర్షి టైం వచ్చింది. సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న మహర్షి సినిమాపై విజయ్ కన్న పడ్డదట. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా చూసి రిలీజ్ తర్వాత రీమేక్ పై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం విజయ్ అట్లీ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అట్లీతో ఆల్రెడీ తెరి, మెర్సల్ సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నాడు విజయ్.

Read more RELATED
Recommended to you

Latest news