గోవా బ్యూటీ ఇలియానా ఆరేళ్ల తర్వాత తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీనువైట్ల డైరెక్ట్ చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఇలియానా.
చాన్నాళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకొచ్చిన అమ్మడిని అడగాల్సిన ప్రశ్నలన్ని అడిగారు మీడియా వారు. ఇక తన కెరియర్ గురించి అన్ని విషయాలను చెప్పుకొచ్చిన ఇల్లి బేబ్ తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ గురించి మాత్రం అడగొద్దని చెబుతుంది. తన గురించి ఆండ్రూ గురించి చెప్పాల్సిందంతా ఇన్ స్టాగ్రాం లో చెప్పేశానని.. ఇక చెప్పేది ఏమి లేదని అన్నది ఇలియానా. ఇక ప్రెగ్నెన్సీ వార్తలపై కాదు లేదు కూడా చెప్పలేదు ఇలియానా. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లలో మై హనీ.. మై హబ్బీ అని పెడుతున్న ఇలియానా మీడియా ముందు ఎందుకు వారి రిలేషన్ ను దాస్తుందో తెలియాల్సి ఉంది.