సెక్సీ స్థానే సిక్స్… ఇలియానా స్పోర్ట్స్ మాటలు ఫిక్స్!

-

ఇంతకాలం సినిమా మాటలు పలికిన గోవా బ్యూటీ ఇలియానా… ఇకపై స్పోర్ట్స్ మాటలు మాట్లాడబోతుంది. సినిమాలో భారీ డైలాగులకు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిన ఆమె… ఇకపై సొంతంగా స్పోర్ట్స్ కబుర్లు చెప్పబోతోంది. తారక్, మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, రాం అన్న నోటితోనే… కోహ్లీ, రోహిత్, ధోనీ అనబోతోంది. ఇంతకాలం సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో వెండితెరపై వెలుగులు చిమ్మిన బ్యూటీ… ఇప్పుడు సిక్స్, ఫోర్ అనబోతోంది. అవును… ఎప్పటినుంచో స్పోర్ట్స్ యాంకర్ అవుతుంది అని వస్తోన్న వార్తలు ఆల్ మోస్ట్ కన్ ఫాం అయినట్లేనని తెలుస్తోంది!

అవును… టాలీవుడ్ లో “దేవదాస్” చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా… అనతి కాలంలోనే అగ్రనటిగా ఎదిగి, దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్లో అగ్ర నటులందరి సరనన నటించి అనంతరం బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబై ఫ్లైట్ ఎక్కేసింది ఇల్లీ! దాంతో తెలుగు వారికి కాస్త దూరమైనా… సినీ ప్రేక్షకులకు మాత్రం దగ్గరిగానే ఉంది! అయితే, ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోవడంతో కొత్త కెరీర్ ను ప్రారంభిచేందుకు ఇల్లీ బేబీ రెడీ అవుతోందని… యాంకర్ గా మారేందుకు ఇలియానా యత్నిస్తోందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ క్రమంలో ఆ కథనాలు అన్నీ నిజమేనని తెలుస్తోంది. కొత్త కెరీర్ లో భాగంగా స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు సన్నాహకాలు చేసుకున్న ఇలియానా… ఆ క్రమంలో ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపి ఫైనల్ చేసుకుందంట. దీంతో ఇకపై స్పోర్ట్స్ ఛానల్ లో ఇల్లీ బేబీ అందాలకు తోడు, అందమైన మాటలు కూడా కనువిందుచేయబోతున్నాయన్నమాట అంటూ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారంట!

Read more RELATED
Recommended to you

Latest news