సిఎం జగన్ దేశంలో ఎవరి మాట వినరు అంటూ మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ఏడాది పాలనపై ఆయన తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేసారు. సిఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరికే భయపడతారు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేనే రాజు నేనే మంత్రి అనుకోవడం తప్పని అన్నారు.
ఎన్నికల కమీషనర్ విషయంలో ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళడం తప్పు కాదని, కాని రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా కొనసాగించక పోవడం చాలా తప్పు అని ఆయన మండిపడ్డారు. జగన్ పాలనపై ఇప్పటికే చదువుకున్న వారు అందరికి కూడా అవగాహన వచ్చింది అని మరి కొన్ని రోజుల్లో మిగిలిన వారికి కూడా వస్తుందని తాను ఆశిస్తున్న అని జేసీ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు.
కోర్ట్ లు ఎన్ని సార్లు చెప్పినా సిఎం జగన్ వినే రకం కాదని ఆయన మండిపడ్డారు. ఇప్పటి రాజకీయాల్లో ఉన్నందుకుతాము చాలా బాధ పడుతున్నామని ఈ సందర్భంగా జేసి అన్నారు. ఇక జగన్ ఏడాది పాలనకు గానూ ఆయన మార్క్ లు కూడా వేసారు. జగన్ ఏడాది పాలన కు తాను 110 మార్కులు వేస్తా అని ఆయన మండిపడ్డారు. సిఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు సరికాదని జేసి ఈ సందర్భంగా మండిపడ్డారు.