ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమా ఆఫీసుపై ఐటీ దాడులు చేసింది. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతోపాటు వారి సన్నిహితుల నివాసాలలో సోదాలు జరుగుతున్నాయి. ఏషియన్ నిర్మాణ సంస్థ హీరో మహేశ్‌బాబుతో కలిసి ఏఎంబీ మాల్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. వారి ఇళ్లల్లో కీలకమైన పత్రాలు అధికారులు పరిశీలిస్తున్నారు.
చాలా ఏళ్లుగా సినిమాల పంపిణీదారులుగా ఉన్న ఈ సంస్థ ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్లు కూడా నడుపుతుంది. మొన్నీమధ్య మహేష్ బాబుతో కలసి ఏఎంబి మాల్ ను ఇదే సంస్థ ఏర్పాటు చేసింది. ఐటి సోదాల్లో భాగంగా కొండాపూర్ లోని ఏఎంబి సినిమాస్ లోను అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. లాభాలను తక్కువగా చూపించి పన్ను ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యనే ఏషియన్ సినిమాస్ సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే ఎక్కువగా పెద్ద పెద్ద వారు ఎందుకని ఇలాంటి వన్నీ చేస్తున్నారు. అవి కావాలని అలా జరుగుతుందా లేక దానికి సంబంధించి వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు పన్నులు అన్నీ కట్టి చూసుకునేవారు తప్పుచేస్తున్నారా అన్నది తెలియడంలేదు. గతంలో కూడా ఒకసారి మహేష్‌బాబు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. ఈ సంస్థ త్వరలో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టిప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే నాగచైతన్య హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సినిమాస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.