ఫ్యామిలీ మేన్-2 విమ‌ర్శ‌ల‌పై స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

స‌మంత న‌టించిన ఫ్యామిలీ మేన్-2 (The Family Man 2) వెబ్‌సిరీస్ విష‌యంలో మొద‌టి నుంచి వివాదాలే నెల‌కొన్నాయి. దీన్ని ఆపాలంటూ ఏకంగా త‌మిళ‌నాడు ప్ర‌భ‌త్వం స‌మాచార శాఖ‌కు లెట‌ర్ రాయ‌డం పెద్ద దుమార‌మే రేపింది. ఈలం యుద్ధంలో త‌మిళుల పోరాటాన్ని కించ‌ప‌రిచారంటూ మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ అనేక మ‌లుపుల త‌ర్వాత దీన్ని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

విడుద‌ల త‌ర్వాత వివాదాలు త‌గ్గిపోయాయ‌ని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో త‌మిళుల పోరాటాన్ని ప‌థాకంగా చేసుకుని తెర‌కెక్కించారు. ఇందులో రాజీ పాత్ర‌లో స‌మంత డీ గ్లామ‌ర్‌గా న‌టించి మెప్పించింది. ఫ్యామిలీ మేన్-2 సిరీస్‌లో సమంత న‌ట‌నే హైలెట్‌గా నిలిచింది. ఇందులో మంచు మ‌నోజ్ తో పాటు ఇత‌రులు న‌టించారు.

ఇక మొద‌టిసారి త‌న పాత్ర‌పై స‌మంత స్పందించింది. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు, మహిళలు అనుభ‌వించిన బాధ‌ల గురించి తెలియజేసే డాక్యూమెంటరీలు క‌న్నీళ్లు తెప్పించాయ‌ని చెప్పారు. ఆ యుద్ధ సమయంలో వాళ్ళు పడ్డ కష్టాలు, కన్నీటి గాథలు ఊహించుకుంటునే త‌న గుండె తరుక్కుపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. రాజీ కథ కల్పితమైనప్పటికీ ఆ యుద్ధం కారణంగా చ‌నిపోయిన వారికి ఒక నివాళి అంటూ చెప్పింది.