‘అరవింద’ మాదిరిగా ‘అల’ కూడా విజయాన్నిస్తుందా….??

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట కథ, మాటల రచయితగా ప్రవేశించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత మెల్లగా తన రైటింగ్ టాలెంట్ తో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్లడం జరిగింది. ఆ తరువాత తరుణ్, శ్రీయల కాంబినేషన్ లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది. ఆ తరువాత మహేష్ తో తీసిన అతడు, అనంతరం పవన్ తో తీసిన జల్సా సినిమాలతో వరుసగా సూపర్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అక్కడినుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న త్రివిక్రమ్ కెరీర్ లో కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి.

ఇకపోతే గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి, కెరీర్ పరంగా త్రివిక్రమ్ కి నెగటివ్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం తో, మంచి కసితో తదుపరి ఎన్టీఆర్ తో తీయబోయే అరవింద సమేత కథ రాసుకున్న త్రివిక్రమ్, ఎట్టకేలకు ఆ సినిమాతో సూపర్ హిట్ ని దక్కించుకుని మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి అలవైకుంఠపురములో సినిమా తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, ఈ సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడట.

interesting News On ala vaikunthapurramloo Movie
interesting News On ala vaikunthapurramloo Movie

అయితే దానికి ఒక కారణం ఉందంటూ,ఒక వార్త నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. నిజానికి సినిమా వాళ్ళు అంటేనే ఎక్కువగా సెంటిమెంట్స్ ని నమ్ముతుంటారు. ఇక గత సినిమా అరవింద సమేతలో ‘అరవింద’ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన పూజ హెగ్డే, ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమాలో ‘అల’ అనే అమ్మాయిగా ఒక కంపెనీకి సీఈఓ పాత్రలో నటిస్తోందట. హీరోతో పాటు సినిమాలో ఆమె పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. మరి అరవిందగా అలరించి త్రివిక్రమ్ కి హిట్ అందించిన పూజ, ఈసారి అల గా ఎంత మేర ఆయనకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి…!!

Read more RELATED
Recommended to you

Latest news