గోరు వెచ్చని ఆవు పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలాగే భోజనంలో నెయ్యి తిన్నా, వెల్లుల్లి రసం తాగినా తలనొప్పి తగ్గుతుంది.
జలుబు, దగ్గు, జ్వరం లాగే.. తలనొప్పి కూడా మనకు అప్పుడప్పుడు వచ్చే స్వల్ప అనారోగ్య సమస్యల్లో ఒకటని చెప్పవచ్చు. నిద్రలేమి, పని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్ తెరను చూడడం, తగినంత నీటిని తాగకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. అయితే తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి వెంటనే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడకూడదు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే తలనొప్పిని తగ్గించుకునేందుకు మనకు కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే…
1. సాధారణంగా కొందరు నిత్యం నీటిని తగిన మొత్తంలో తాగరు. అందువల్ల కూడా తలనొప్పి వస్తుంది. కనుక మీరు నీటిని తాగడం లేదని భావిస్తే నిత్యం మీకు సరిపడినంత నీటిని తాగండి. దీని వల్ల తలనొప్పి తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
2. శరీరంలో తగినంత మెగ్నిషియం లేకున్నా తలనొప్పి వస్తుంది. నిత్యం 600 మిల్లీగ్రాముల మెగ్నిషియం సిట్రేట్ తీసుకోవడం వల్ల తలనొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు. అయితే మెగ్నిషియం పిల్స్ వాడితే కొందరికి డయేరియా సమస్య వస్తుంది. అలాంటి వారు మెగ్నిషియం ఉండే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.
3. మద్యం బాగా సేవించే వారికి కూడా తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు మద్యానికి దూరంగా ఉండాలి.
4. నిద్ర మరీ తక్కువైనా, బాగా ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కనుక రోజూ తగినన్ని గంటల పాటు మాత్రమే నిద్రించాలి.
5. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఈ చిట్కా ఎలాంటి తలనొప్పినైనా తగ్గిస్తుంది.
6. గోరు వెచ్చని ఆవు పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలాగే భోజనంలో నెయ్యి తిన్నా, వెల్లుల్లి రసం తాగినా తలనొప్పి తగ్గుతుంది.
7. గంధం చెక్కను అరగదీసి ఆ పేస్టును నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
8. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వేడి చేసి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే యూకలిప్టస్ ఆయిల్‌ను కూడా ఇదే విధంగా వాడవచ్చు.
9. గోరు వెచ్చని నీటిని ఒక బకట్ నిండా తీసుకుని అందులో పాదాలను ఉంచాలి. ఇలా రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు 15 నిమిషాల పాటు చేస్తే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.
10. తరచూ తలనొప్పి బారిన పడేవారు వెన్న, చాక్లెట్లు, మాంసాహారం, జంక్ ఫుడ్ తినరాదు. క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకు కూరలను ఎక్కువగా తినాలి.