భార‌త్‌లో రేప్‌ల‌కు ఆ హీరోయిన్ అందాలే కార‌ణ‌మా… షాకింగ్ రిప్లై

ప్రస్తుతం దేశంలో సౌత్ టు నార్త్ ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్న లైంగిక హ‌త్యాచారాల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా హైదరాబాద్ లో సామూహిక హ‌త్యాచారానికి గురైన ప్రియాంక రెడ్డికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు దిశ దారుణ హ‌త్య‌ ఖండిస్తున్నారు. ఎవరికి వారు ఆమెపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

సోషల్ మీడియాలో వ‌రుస హ‌త్యాచారాలపై ఎవరికివారు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక నెటిజ‌న్ నుంచి ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు పెద్ద షాక్ తగిలింది. హీరోయిన్లు సహజంగానే తమ పాపులారిటీని పెంచుకునేందుకు మీడియాలో తమ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. నిధి అగర్వాల్ కూడా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు అందాల విందు చేస్తూ ఉంటుంది.

ఆమె త‌న ట్విట్ట‌ర్లో ఒక హాట్ ఫొటో పోస్ట్ చేసింది. ఒక నెటిజ‌న్ మాత్రం నీ లాంటి వాళ్లు ఇలాంటి హాట్ ఫొటోలు పెట్టి రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే మ‌హిళ‌లు హ‌త్య‌చారాలు, అత్య‌చారాల‌కు గుర‌వుతున్నారు.. ఇంత హాట్ హాట్‌గా క‌నిపించ‌వ‌ద్దు.. ఇలాంటి పిక్‌లు పెట్ట‌వ‌ద్దంటూ పోస్ట్ పెట్టాడు. ఈ కామెంట్ తో నిధికి చిర్రెత్తు కొచ్చేసింది.. వెంట‌నే చాలా ఘాటు రిప్లే ఇచ్చింది.

“ఈ వ్యక్తి దారుణమైన ఆలోచన విధానానికి నేను షాక్ కు గురయ్యాను. నరేష్ మీ అడ్రెస్ పంపండి. పింక్ అనే సినిమాను మీకు పంపుతాను.. మీకు చాలా అవసరం” అంటూ గట్టిగా బుద్ధి చెప్పింది. నిధి ఆన్స‌ర్‌పై ఎవ‌రికి వారు అనుకూలంగా, వ్య‌తిరేకంగా త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.