ఏపీ బీజేపీ అవుట్ డేటెడ్ లీడ‌ర్లు… అవినీతి నేత‌ల‌తో కంపు కొడుతోందా…!

-

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుంది అన్నట్టుగా ఉంది ఏపీలో బీజేపీ నేతల పరిస్థితి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఒంటరి పోరాటం చేసిన బిజెపికి ఏ ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్లు దక్కలేదు.. అన్ని సీట్ల‌లోనూ ఆ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ నుంచి పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండ‌ల మాణిక్యాలరావు, ద‌గ్గుబాటి పురందేశ్వరి లాంటి నేతలు సైతం ఓడిపోయారు. వీళ్ల‌కు క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. అయినా సరే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం అని బీజేపీ బీరాలు పలుకుతోంది.

ఎన్నో రాష్ట్రాల్లో తమకు ఒక్క సీటు లేని స్థితి నుంచి అధికారంలోకి వచ్చే రేంజ్‌కు ఎదిగామ‌ని ఆ పార్టీ నేతలు గొప్పలు చెపుతూ ఉంటారు. అమిత్ షా, మోడీ అప‌ర చాణుక్యులు అని వీరి రేంజ్‌తో తాము ఏదైనా సాధిస్తామ‌ని వాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో ఎలాగూ బ‌లం పుంజుకునే ఛాన్సులు లేక‌పోవ‌డంతో బీజేపీ ఏపీలో ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటోంది.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ చేసిన మోసం ఏపీ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందుకే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ఇక ఇప్పుడు బీజేపీకి ఏపీలో దొరుకుతోన్న నేత‌ల‌ను చూస్తుంటే వాళ్లంతా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నవారో ? లేదా ? అవుట్ డేటెడ్ అయిన వాళ్లో మాత్ర‌మే ఉంటున్నారు. సుజానా, సీఎం ర‌మేష్‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న నేత‌ల నుంచి అవుట్ డేటెడ్ అయిన బైరెడ్డి రాజశేఖ‌ర్ రెడ్డి, కావూరు సాంబ‌శివ‌రావు లాంటి వాళ్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.

సీబీఐ-ఈడీ దాడులను ఎదుర్కొన్న వారికి ప్ర‌జ‌ల్లో బ‌లం లేక‌పోయినా బీజేపీ మాత్రం మంచి పున‌రావాస కేంద్రంగా మారింది. ఇలాంటి నేత‌ల వ‌ల్ల వాళ్ల‌కు ఎస్కేప్ అయ్యేందుకు ఉప‌యోగం ఉంటోందే కాని.. బీజేపీకి ఎంత మాత్రం బ‌లం కాద‌న్న‌ది బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఎప్పుడు ? తెలుసుకుంటుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news