మెగా మేనళ్లుడు టైటిల్ అదిరిందిగా..!

-

మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమాను బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ మూగవాడిగా నటిస్తున్నాడట. సినిమాలో హీరో జాలరిగా కనిపిస్తాడట. అందుకే సినిమా స్టార్టింగ్ పోస్టర్ లోనే జాలరి వేషంలో వైష్ణవ్ తేజ్ అదరగొట్టాడు. అయితే ఇక ఇప్పుడు సినిమా టైటిల్ కూడా జాలరి అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

మెగా హీరోల్లో ఇప్పటికే ఓ క్రికెట్ జట్టుకి సరిపడినంత ఉన్నారు. ఎంట్రీ గ్రాండ్ గా జరిగినా టాలెంట్ లేకపోతే డీలా పడాల్సిందే. అందుకే మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే ప్రయోగాత్మకంగా చేస్తున్నాడు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుంది. మెగా ఫ్యాన్స్ అందండలు ఓపెనింగ్స్ వచ్చేలా చేసినా అసలు సినిమా కంటెంట్ తో పాటుగా కుర్రాడిలో టాలెంట్ ఉంటే దూసుకెళ్తాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news