ఖైది నంబర్ 150 తర్వాత చిరంజీవి చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా రాబోతుందని తెలిసిందే. ఈ సినిమాలో ఓ క్రేజీ రోల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తాడని తెలుస్తుంది. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా బన్ని అదరగొట్టాడు.
సైరాలో కూడా అలాంటి ఓ అదిరిపోయే రోల్ బన్ని చేస్తాడని అంటున్న్నారు. సైరాలో చిరుతో బన్ని స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కెరియర్ కు మరింత బూస్టింగ్ దొరికినట్టే. స్టైలిష్ స్టార్ గా బన్ని సెపరేట్ ఫ్యాన్స్ ఏర్పరచుకోగా సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. మరి సైరాలో నిజంగానే బన్ని ఉన్నాడా లేడా అన్నది చూడాలి.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉంది. 2019 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.