డెబ్యూ మూవీతోనే బాలీవుడ్ లో స్టార్ హోదా .. పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటే అంత క్రేజా ..!

-

ప్రణీత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమంత నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మంచి పాత్ర చేసిన ప్రణీత ఎందుకనో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మాత్రం స్టార్ డం ని దక్కించుకోలేకపోయింది. అంతేకాదు గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు లేక పర భాషల్లో అవకాశాలు వెతుక్కుంటోంది.

 

చెప్పాలంటే తెలుగులో ప్రణీత చేసినవన్ని మంచి సినిమాలే. అందులో ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ సినిమాలు ఉన్నాయి. ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రణీత ‘బావ’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘డైనమైట్’ ‘రభస’ ‘బ్రహ్మోత్సవం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలలో నటించింది. కాని స్టార్ హీరోయిన్ అన్న మాటకి మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయింది.

 

అయితే ప్రణీత కన్నడ ఇండస్ట్రీ లో మాత్రం సక్సస్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా ఫాం లో ఉంది. ఇక ప్రణీత బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి ‘భుజ్’ ‘హంగామా 2’ అన్న సినిమాలలో నటించింది. వీటిలో ప్రణీత బాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన ‘భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంటరయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ సంజయ్ దత్ సోనాక్షీ సిన్హా నోరా ఫతేహి తో కలిసి ప్రణీత నటించింది. బాలీవుడ్ మీడియా నుండి అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోందట. తన డెబ్యూ సినిమా లాక్ డౌన్ కారణంగా ఎక్కడ రిలీజ్ కాకుండా పెండింగ్ పడుతుందో అనుకున్న ప్రణీత కి ఇది ఎంతో ఉత్సాహాన్నిచ్చే న్యూస్ అని చెప్పాలి. మొత్తానికి ప్రణీత బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version