మహర్షి కాదు శ్రీమంతుడు-2 అటగా..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మరో శ్రీమంతుడు కాబోతుందని అంటున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఊరి బాగు కోసం హర్ష అనే ఓ శ్రీమంతుడు ఎలా ఆ ఊరికి సాయం చేశాడన్నది ఆ సినిమా కథ.

ఇక ప్రస్తుతం మహేష్ చేస్తున్న మహర్షి సినిమాలో కూడా బిలీనియర్ అయిన మహేష్ తన స్నేహితుడు నరేష్ కోసం అతని ఊరికి వచ్చి అతని ఊరి సమస్యలను సాల్వ్ చేస్తాడట. అటు ఇటుగా ఇది కూడా శ్రీమంతుడు సినిమా సీక్వల్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మహేష్ సి.ఈ.బో లుక్ తో వచ్చిన పోస్టర్ అదరగొట్టగా త్వరలో సినిమాకు సంబందించి టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 6న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మూవీ లైన్ లో పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version