‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా ఆ లిస్ట్ లోనే ఉందా ..?

-

అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. కాని ఏది హిట్ ఇవ్వలేదు. అయితే ఈ సారి మాత్రం హిట్ పక్కా అని ధీమాగా ఉన్నాడు ఈ అక్కినేని హీరో. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తుంది. ఇప్పటికే ఈ జంట మీద బాగా క్రేజ్ నెలకొంది. ఇక గతంలో పూజా నాగ చైతన్య తో నటించిన ఒక లైలా కోసం మంచి హిట్ ని అందుకుంది. ఆ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

 

ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ లిరికల్ ‘మనసా మనసా’ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. దీంతో కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియోటయింది.

ఇక ఈ సినిమాలో ఉన్న లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని యూనిట్ నమ్మకంగా ఉన్నారు. వాస్తవంగా ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా సక్సస్ అఖిల్ తో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి చాలా కీలకం. అయితే అందరిలాగానే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీం కూడా ఈ సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఉన్నారట. పరిస్థితులు చక్కబడితే… వి, రెడ్, క్రాక్, నిశబ్ధం సినిమాలతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ని ఆగస్ట్ తర్వాత రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news