ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా ఉంటుందా … క్యాన్సిల్ అవుతుందా …?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. దాదాపు ఇదే టైటిల్ ని ఫైనల్ చేసి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. లేదంటే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ అండ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. ఇక ఈ సినిమాను పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో బ్యూటి ఫుల్ లవ్‌స్టోరీగా రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ఈ రెండు పాత్రలు ఒకదానికి ఒకటి ఎంతో వైవిధ్యంగా ఉంటాయని సమాచారం.

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా అనౌన్స్ ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ కామినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు. అయితే కరోనా మహమ్మారితో చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికి షిఫ్ట్ అయిందని తాజా సమాచారం.

 

పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమాని అదే స్థాయిలో నిర్మించనున్నారట. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్స్ కలి రావడం లేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. సాహో లో శద్ద కపూర్ ని తీసుకున్నప్పటికి ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంతేకాదు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన జాక్విలిన్ ఫెర్నాండెస్ కూడా మైనస్ అయింది. అందుకే హీరోయిన్ విషయంలో మేకర్స్ కూడా డైలమాలో ఉన్నారట.

 

బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలా లేదా ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ లల్లో బాగా ఫేమస్ అయిన పూజా హెగ్డే గాని కియారా అద్వాని గాని అయితే అన్ని విధాలుగా బావుంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నారట. అయితే ఈ సినిమా ఉంటుందా లేదా తాజా పరిణామాలతో క్యాన్సిల్ అవుతుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాని ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవలేదని నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మీద బిజీగా ఉన్నారని సమాచారం. ఇక ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ చిత్రం కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news