ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను ఇప్పుడు కరోనా వైరస్ కలవరపెడుతుంది. రోజు రోజుకి అక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంచలన విషయం బయటకు వచ్చింది. ఏపీలో ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఎవరికి కాంటాక్ట్ లేకపోయినా సరే అక్కడ కేసులు వ్యాపిస్తున్నాయి. దీనికి కారణం కరెన్సీ నోట్లు అని అధికారులు గుర్తించారు. తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కరోనా వైరస్…
కరెన్సీ నోట్ల నుంచి వచ్చింది అని గుర్తించారు. డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వారు అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒకరి నుంచి మరొకరు నోట్ల మార్పిడి ద్వారా కరోనా వ్యాపిస్తుంది అని గుర్తించారు. కరోనా వచ్చిన వ్యక్తి మరొకరికి నోటు ఇవ్వడం తో వ్యాపించింది. దీనితో ఆన్లైన్ లో నగదు చెల్లింపులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేసింది. ప్రజలు అందరూ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం అని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నమోదు అయిన కేసులు అన్నీ కూడా ఇలాగే కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ప్రభుత్వం అప్రమత్తమైంది.