నిజంగానే సంయుక్త, త్రివిక్రమ్ మధ్య ఎఫైర్ ఉందా..?

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ఇండస్ట్రీకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రచయితగా, డైలాగ్ గా రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం డైరెక్టర్గా మారి టాప్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరొకవైపు సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు పాట యావత్ దేశాన్ని ఊపేస్తోంది.. ఈ పాటలో కనిపించిన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ అంతకుముందు భీమ్లా నాయక్, బింబిసారలో కూడా కనిపించింది . ఇలా వరుసగా మూడు హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.

సార్ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్ కాదు.. అలాగని రైటర్ కూడా కాదు.. మరి ఈ సినిమాకి ఈయనకు సంబంధం ఏంటి? ఆయన ఈ సినిమాలో సంయుక్తను హీరోయిన్గా తీసుకోవడం ఏంటి ? అనే విషయానికి వస్తే ఈ చిత్రానికి సహానిర్మాత గా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ కి మదర్ బ్యానర్ లాంటి సితార ఎంటర్టైన్మెంట్స్ లోని ఈ సినిమా విడుదలయ్యింది.. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎంత గొప్పగా తీస్తారు అనే పేరు ఉందో హీరోయిన్లతో ఎఫైర్ల విషయంలో కూడా అంతే పేరు ఉంది. అయితే ఎప్పుడూ ఒకే హీరోయిన్ అన్నట్లుగా కాకుండా పేర్లు మారుతూ ఉంటాయి.

అయితే ఇప్పుడు సంయుక్తా మీనన్ పేరు వినిపిస్తోంది.. తాజాగా తెలుగు హీరోయిన్ రేఖ బోజ్ వీరి రహస్య బంధం పై పోస్ట్ పెట్టింది.. “చాలా కష్టపడుతున్నా గురూజీ .. ఆ మల్లు మీనన్ కే కాదు కాస్త మమ్మల్ని కూడా దయ చూడండి ” అని పోస్ట్ పెట్టింది. మల్లు మీనన్ ఎవరండీ బాబు అని కామెంట్ రావడంతో రీసెంట్ టైంలో చల్లని చూపు పడిన మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ అంటూ క్లారిటీ ఇచ్చింది రేఖా బోజ్ . అంటే ఇన్ డైరెక్ట్ గా ఆ చల్లని చూపు నాపై కూడా పడేట్టు చూడు గురూజీ అని ఓపెన్ గానే అడిగేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే త్రివిక్రమ్ – సంయుక్తల మధ్య ఎఫైర్ ఉందనే విషయాన్ని ఓపెన్ గానే బయటపెట్టింది రేఖా బోజ్.

Read more RELATED
Recommended to you

Latest news