మ్యూజిక్ మాస్ట్రో ను కలిసిన నాగచైతన్య.. పట్టరాని ఆనందంతో ఏమన్నారంటే

-

టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో పాటల్ని మ్యాజికల్ మాస్టర్ ఇళయరాజా కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నాగచైతన్య హైదరాబాద్ వచ్చిన ఇళయరాజాను కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మ్యాజికల్ మాస్ట్రో ఇళయరాజా సంగీత ప్రపంచంలో సృష్టించిన అద్భుతాలు ఎన్నో. ముఖ్యంగా దక్షిణాది చిత్రాల్లో ఆయన సంగీతం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎన్నో క్లాసికల్ మూవీస్ కి సంగీతాన్ని అందించిన ఇళయరాజా సంగీతం మధురానుభూతిని కలిగిస్తుంది. ఆయన కంపోజ్ చేస్తేనే సినిమాలు హిట్ అయిపోతాయి. కేవలం సంగీతం కోసమే సినిమాలు చూసేవారు ఎంతమందో.. ఈయన సంగీతానికి ఎందరో దాసోహం అంటారు అందులో ఒకరే నాగచైతన్య.

హీరో నాగచైతన్య ఇప్పటికే ఇళయరాజా సంగీతానికి పెద్ద ఫ్యాన్ ని అంటూ పలమార్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన ఎదుగుదలలో ఇలియారాజా పాటలు ట్రావెల్ చేశాయంటూ తెలిపారు. తన నుంచి ఇళయరాజా సంగీతాన్ని ఎప్పటికీ దూరం చేయలేమంటూ చెప్పుకొస్తారు. అయితే తాజాగా నాగచైతన్య ఇళయరాజాను కలిశారు.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న కస్టడీ చిత్రానికి ఇళయరాజా తన సంగీతాన్ని అందిస్తున్నారు

తాజాగా హైదరాబాద్కు వచ్చిన ఇళయరాజాను కలిసిన నాగచైతన్య.. “మ్యాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలిసినప్పుడు నా మొహంలో ఇంత పెద్ద చిరునవ్వు. ఆయన కంపోజిషన్లు నా జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేశాయి. చాలా సార్లు నా మైండ్‌లో ఆయా సీన్లు మెదులాడుతూనే ఉంటాయి. ఆయన రిఫరెన్స్ తో స్క్రిప్ట్ ని చిత్రీకరించాను. ఇప్పుడు `కస్టడీ` సినిమా కోసం రాజా సర్‌ కంపోజ్‌ చేస్తున్నారు. నిజంగా ఆయనకు కృతజ్ఞతలు..” అంటూ ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news