తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక నాగచైతన్య ని వివాహం చేసుకుని గత ఏడాది విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరిని బాధపెట్టింది. అయితే వీరిద్దరూ ఇలా ఎందుకు విడిపోతున్నారు అనే విషయాన్ని ఇప్పటివరకు ఏ ఒక్కరు తెలియజేయలేదు. సాధారణంగా సెలబ్రిటీలు సైతం తమకు నచ్చిన వాటిని తీసుకుంటూ ఒక రేంజ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత కూడా ఇప్పుడు అలాంటి లగ్జరీ లైఫ్ ను గడుపుతున్నది.ఏమాయ చేసావే అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూ అటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సైతం సినిమాల్లో నటిస్తున్నది. ఇక తన భర్త తో విడిపోయిన అప్పటి నుంచి ఎక్కువగా సమంత సినిమాల మీద దృష్టి పెట్టి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అంతే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో నటించి జాతీయ నటిగా కూడా గుర్తింపు పొందింది. తాజాగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది.
అయితే ఇదంతా ఇలా ఉండగా సమంత దగ్గర అత్యధికంగా ధర పలికేటువంటి 6 లగ్జరీ కార్లు ఉన్నాయి . ఇప్పుడు వాటి ధరలను మనం తెలుసుకుందాం. సమంత వద్ద ఉన్న కార్లలో జాగ్వర్ ఎక్స్ ఎఫ్ కార్ కూడా ఒకటి దీని ధర రూ. 72 లక్షలు. ఇక సమంత దగ్గర ఉన్న ఆడి క్యూ కారు ధర రూ.83 లక్షలు. ఇక సమంత దగ్గర రెండు రేంజ్ రోవర్ కార్ల ధరలు రూ.2.45 కోట్ల రూపాయలు. మరియు కెయన్ కార్ రూ.1.49 కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. ఇక సమంతా కు ఇష్టమైన మెర్సీడేస్ బెంజ్ కార్ రూ.1.42 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.