హీరోయిన్ గా కృతి శెట్టి ఎదగడం కోసం ఆమె తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉప్పెన సినిమా ద్వారా పరిచయమయ్యి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది కృతి శెట్టి. ఆ తర్వాత వరుస సినిమాలు ఈమెకు మరింత క్రేజ్ ను తీసుకొచ్చాయి. ఇకపోతే ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో అందరూ ఈమెను గోల్డెన్ లెగ్ అని తెగ పొగిడేశారు . వాస్తవానికి కృతి శెట్టి చిన్ననాటి నుంచి హీరోయిన్ అవ్వాలని అనుకోలేదట . ముంబైలో చదువుకున్న సమయంలో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది. అలా ఆమెకు హిందీ సినిమాలలో నటించే అవకాశం లభించింది.

మొదట ఆమె హిందీలో సూపర్ థర్టీ లో స్టూడెంట్ గా నటించింది . ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా ఎదగడానికి ఆమె కుటుంబం చేసిన త్యాగం ఎంతగానో ఉందనే వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 2003వ సంవత్సరంలో ముంబైలో పుట్టిన కృతి శెట్టి తుళు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కర్ణాటకలోని మంగళూరు వాస్తవ్యులు. తన తండ్రి వ్యాపార రీత్యా ముంబైకి వచ్చి సెటిల్ అయ్యాడు.

ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్.. కృతికి ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు. ముంబైలో పెరిగిన కృతి శెట్టి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వరుసగా అవకాశాలు రావడంతో కృతి శెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న జాబును కూడా వదిలేసిందట. ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు తల్లిని కూడా తీసుకెళ్తుంది అంట కృతి శెట్టి. అలా తన కెరియర్ కోసం తల్లి కెరియర్ ను సైతం పణంగా పెట్టింది. అయితే ఈ విషయం గురించి చెప్పి ఇటీవల ఒక ఫంక్షన్ లో వెల్లడించింది. చాలామంది కృతి తల్లి చేసిన పనికి శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news