జాను టీజర్, స్టూడెంట్ గా శర్వానంద్…!

-

యువ హీరో శర్వానంద్ హీరోగా సి ప్రేమ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జాను. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యూత్ లవ్ స్టోరీగా విభిన్న కథతో వస్తున్నట్టు తెలుస్తుంది.

గురువారం సాయంత్రం ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్‌ గా వచ్చింది. రీసెంట్‌గా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం విడుదల చేసిన ఈ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

శర్వానంద్, సమంతా ఇద్దరూ స్టూడెంట్స్ గా కనపడగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విజివల్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళంలో సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగులోనూ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 7న సినిమాను విడుద‌ల చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news