రోజురోజుకి దూరం అవుతున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ లు .. అసలు విషయం ఇదేనా..?

-

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యారు. అంతేకాకుండా ఈ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గురువారం, శుక్రవారం లో ప్రసారం అవుతూ రెండు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది ఈ కామెడీ షో. ఇదిలా ఉంటే రానురాను జబర్దస్త్ షో కి కళ తప్పి పోతుంది అని చెప్పవచ్చు. ఇందుకు గల ముఖ్య కారణం జబర్దస్త్ నుంచి.. ఆర్టిస్టుల వరకు మెల్లమెల్లగా జబర్థస్త్ విడిచి పోవడం ముఖ్య కారణమని చెప్పవచ్చు.

మొదట 2019వ సంవత్సరంలో ఈసారి నాగబాబు వదిలి వెళ్ళిపో గా.. నాగబాబు తో పాటుగా పలువురు ఆర్టిస్టులు కూడా వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా జబర్దస్త్ షో ని విడిచి వెళ్లడం జరుగుతోంది. ఇక ఇటీవల జబర్దస్త్ జడ్జి రోజా మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఇక అందుచేతనే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త టీములతో జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇస్తున్నా.. ఇది వరకటిలా స్కిట్లతో కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరించలేకపోతోంది.

ఇప్పటికే జబర్దస్త్ లో ఉండే ముక్కు అవినాష్, అదిరే అభి, అప్పారావు కూడా వెళ్లిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్, గెటప్ శీను, జబర్దస్త్ హైపర్ ఆది వంటి వారు కూడా ఈ మధ్య కాలంలో అస్సలు కనిపించలేదు. జబర్దస్త్ షో ప్రారంభమై ఇప్పటికి 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. కానీ టిఆర్పి రేటింగ్ విషయంలో రికార్డులను ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటుంది. ఇక గతంలో కంటెస్టెంట్ లు లేకపోవడంతో రాను రాను ఈ షూటింగ్ జరుగుతుంది అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ షో ని ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని తెలియజేయడం లేదు. మరి రాబోయే రోజులలో నైనా తెలియజేస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version