జబర్దస్త్.. నాగబాబుతో విభేదాలు.. ఈ వయసులో కూడా..రోజా..!

-

బుల్లితెర షోలలో జబర్దస్త్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఈ షో 2013లో ప్రారంభమవగా ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. షో ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు అనేకమంది తమ జీవితాలను మార్చుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తమను తాము మరింత పాపులారిటీ చేసుకున్నారు. ముఖ్యంగా కొత్త వాళ్లే కాదు సీనియర్ సెలబ్రిటీలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందారు. అలాంటి వారిలో నాగబాబు, మంత్రి ఆర్కే రోజా కూడా ఒకరు అని చెప్పవచ్చు. రోజా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ పూర్తిస్థాయిలో ఆదుకుంది.

ఇదిలా ఉండగా ఆర్కే రోజాతో నాగబాబు విభేదాల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు అనే వార్తలు అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రోజా క్లారిటీ ఇచ్చింది. రోజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగబాబు నావల్ల జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అనే మాటల్లో వాస్తవం లేదు. నాగబాబుగారు నాతో చాలా పాజిటివ్ గా ఉంటారు. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఈ విషయం నాకు తెలిపారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టని ఒకే ఒక్క హీరోయిన్ నువ్వు అని మెచ్చుకున్నారు.. ఎందుకంటే వారు ప్రొడక్షన్ బ్యానర్ లో నేను ముగ్గురు మొనగాళ్లు సినిమా కూడా చేశాను.

అలాగే నేను డాన్స్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నారు . ఒకసారి శేఖర్ మాస్టర్ తో సాంగ్ చేసినప్పుడు మిగతా వాళ్లతో మీరంతా ఈ ఏజ్ లో చేస్తున్నారయ్యా.. కానీ మా ఏజ్ కు కూడా మీకు ఈక్వల్ చేస్తుంది చూడండి అంటూ తనను పొగిడాడు అని నాగబాబు తో తనకు ఎలాంటి విభేదాలు లేవని రోజా వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news