జబర్దస్త్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్… షూటింగ్ ఆపేశారు…!

-

తెలుగు బుల్లి తెర మీద తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న టీవీ షో… జబర్దస్త్. ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో కి ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఈ షో ని ఇప్పుడు ఆపేసే ఆలోచనలో ఉన్నారు యాజమాన్యం. ఈ షోని కరోనా కారణంగా షూటింగ్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ లు అన్నీ కూడా దాదాపుగా ఆపివేసింది చిత్ర యూనిట్.

ఈ నేపధ్యంలోనే ఈ షో ని కూడా నిలిపి వేసే ఆలోచనలో ఉన్నారు. ఈ షో నిర్వహించాలి అంటే జడ్జి, యాంకర్లు, ఆర్టిస్ట్ లు సహాయ సిబ్బంది, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది ఎందరో హాజరు కావాల్సి ఉంది. కరోనా నేపధ్యంలో వీళ్ళు అందరూ ఒక్క చోట హాజరు అయితే ఇబ్బంది వస్తుందని భావించి షో ని నిలిపివేసే యోచనలో యాజమాన్యం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈటీవీ యాజమాన్యం తో కూడా మాట్లాడినట్టు సమాచారం.

దీనికి యాజమాన్యం కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ షోకి జడ్జిగా ఉన్న రోజా శుక్రవారం ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించలేదు. ఆమె బదులు శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే రోజా స్టే హోం లో భాగంగా ఇంటికే పరిమితం అయ్యారు. మరో రెండు మూడు షోస్ చిత్రీకరించారని అవి ప్రసారం చేసిన తర్వాత పాతవి మళ్ళీ ప్రసారం చేస్తారని కొత్తవి ఇప్పట్లో షూటింగ్ లేదని అంటున్నారు. ఈ షో లేకపోతే మాత్రం కొందరు ఆర్టిస్ట్ లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version