Jailer : ఎక్కడా తగ్గని రజనీ స్టామినా..రూ.450 కోట్లు క్రాస్

-

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమా డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దిశగా కొనసాగుతుంది జైలర్ మూవీ.

సూమారు 7000 స్క్రీన్‌లపై మొన్న గురువారం గ్రాండ్​గా రిలీజైన ఈ మూవీ అద్భుతమైన ఓపెనింగ్‌తో బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతోంది. కేవలం 7 రోజుల్లోనే రూ. 450 కోట్లు వసూలు చేసింది. అత్యంత వేగంగా రూ. 150 కోట్లు సాధించిన తమిళ సినిమాగాను సంచలనం సృష్టించింది. రోబో 2.0 ఏడురోజుల్లో రూ. 526 కోట్ల వసూలు చేయగా…పోన్నియిన్ సెల్వన్ రూ. 308 కోట్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news