వారం లోపే ఓటీటి లోకి వచ్చేస్తున్న జైలర్.. మూవీ

-

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా కనిపిస్తూనే ఉన్నది.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారంటూ రజిని ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడిపోతున్నారు.డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. తెలుగు తమిళ్ హిందీ భాషలలో విడుదలైన జైలర్ సినిమా సూపర్ స్టార్ తన నటనతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ .90 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నయా రికార్డును సృష్టించింది. ప్రస్తుతం రూ .300 కోట్ల రూపాయలకు చేరువలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి షో నుంచి జైలర్ సినిమా పాజిటివ్ టాక్ ను ఏర్పరచుకొని సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ ,మోహన్లాల్, సునీల్ , తమన్నా తదితరులు సైతం నటించారు తాజాగా ఈ సినిమా ఓటీటి రిలీజ్ పై ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కేవలం ఒక వారంలోని ఓటీటి లో రాబోతోంది అంటూ పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. సన్ నెక్స్ట్ లో స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ఫెస్టివల్ కు విడుదల చేసే విధంగా చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.తమిళనాడు దీపావళి పండుగను చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అయితే దీపావళికి చాలా సమయం ఉండడంతో విజయదశమి కానుకగా జైలర్ చిత్రాన్ని ఓటీటి లో విడుదల చేసి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పలు విదేశాలలో కూడా జైలర్ సినిమా హవా కొనసాగుతోంది. మరి ఓటిటి విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news