మహిళలకి గుడ్ న్యూస్.. రూ.11 లక్షలు మీవే..!

-

ఎన్నో రకాల స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి లాభాలు కలుగుతున్నాయి. భారతదేశంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఎంత ఆదరణ ఉందో చెప్పక్కర్లేదు. ఎల్‌ఐసీలో పాలసీ తీసుకుంటే ఎంతో లాభం ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలని ఎల్ఐసి తీసుకు వస్తుంది. మహిళల కోసం సరికొత్త పాలసీని స్టార్ట్‌ చేసింది కూడా. ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ తో చక్కటి లాభాలు కలుగుతాయి.

నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం ఇది. ఈ ప్లాన్‌ కి సంబంధించి వివరాలని తెలుసుకుందాం. ఆధార్‌ శిలా ప్లాన్ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత స్థిర చెల్లింపు వస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే కుటుంబానికి పాలసీ మొత్తాన్ని ఇస్తారు. ఆధార్ కార్డు ఉంటేనే దీనికి అర్హులు. ఈ పథకంలో 55 ఏళ్ల లోపు వుండే మహిళలు మాత్రమే చేరాలి.మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలుగా ఉంటుంది.

పాలసీ వ్యవధి 10 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. ఆధార్ శిలా పాలసీ ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ. 11 లక్షలు వస్తాయ్. రోజుకు రూ.87 పెట్టుబడి కింద పెట్టాలి. వార్షికంగా రూ. 31,755 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 10 సంవత్సరాలకు మొత్తం రూ. 3,17,550 అవుతుంది. 70 ఏళ్ల వయస్సు వచ్చాక మీకు రూ.11 లక్షలు వస్తాయి. పాలసీదారు మరణించినప్పుడు హామీ మొత్తం నామినీకి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news