విశాఖపట్నం నుంచి చార్‌ధామ్… వీటిని చూసి రావచ్చు..!

-

చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వాళ్లకి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీటూరిజం ఇప్పటికే చాలా టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. బద్రినాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రితో పాటు బార్‌కోట్, జాంకి చట్టి, ఉత్తరకాశీ, గుప్తకాశీ, సోన్ ప్రయాగ్ కూడా ఈ ప్యాకేజీ తో చూసి రావచ్చు. సెప్టెంబర్ 16న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఫ్లైట్‌లో పర్యాటకులు చార్‌ధామ్ యాత్ర కి వెళ్లి రావచ్చు. 11 రాత్రులు, 12 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

మొదటి రోజు విశాఖపట్నంలో ఇది మొదలు అవుతుంది. ఉదయం 8.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 11.15 గంటలకి ఢిల్లీ రీచ్ అవుతారు. అక్కడ నుండి రెండో రోజు హరిద్వార్ నుంచి బార్‌కోట్ బయల్దేరాలి. రాత్రికి బార్‌కోట్‌లో ఉండాలి. మూడో రోజు జాంకీ చట్టి చేరుకొని యమునోత్రి వెళ్ళాలి. సొంత ఖర్చులతో పోనీ, పల్లకి ని బుక్ చేసుకోవచ్చు. లేదా ట్రెక్కింగ్ చేయొచ్చు. నాలుగో రోజు ఉదయం బార్‌కోట్ నుంచి ఉత్తరకాశీ. సాయంత్రం కాశీ విశ్వనాథ ఆలయ దర్శనం.

రాత్రికి ఉత్తరకాశీలో ఉండాలి. ఐదో రోజు గంగోత్రి స్టార్ట్ అవ్వాలి. గంగ ఆలయాన్ని చూసి తర్వాత ఉత్తరకాశీకి తిరిగి చేరుకోవాలి. ఆరో రోజు గుప్తకాశీ. రాత్రికి గుప్తకాశీలో ఉండాలి. ఏడో రోజు సోన్‌ప్రయాగ్. ఆ తర్వాత కేదార్‌నాథ్. ఎనిమిదో రోజు కేదార్‌నాథ్ ఆలయం చూడచ్చు. గౌరీకుండ్‌కు ట్రెక్కింగ్ ఉంటుంది. రాత్రికి గుప్తకాశీలో ఉండాలి. తొమ్మిదో రోజు బద్రినాథ్. పదకొండో రోజు రుద్రప్రయాగ్ నుంచి హరిద్వార్. ఇలా ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news